Sunday 6 January 2013

అందాల మా ఇల్లు



















అందాల మా ఇల్లు
అపురూపమైనది !
హరివిల్లు మాదిరీ
అలరించుచున్నది !!
ఆటలాడగ మాకు
ఆటస్థలము కలదు !
ఆట సమయాలలో
ఆడుకుందుము మేము !!
కనులపండుగ చేయు
పూలతోటా కలదు !
పూలను చూస్తుంటే
హాయికలుగును మాకు !!
అమ్మ వండుట కొరకు
వంటగది ఒకటుంది !
శుచికి శుభ్రతకదియు
నెలవుగా ఉంటుంది !!
భోజనం చేయుటకు
ప్రత్యేక గది ఉంది !
అచటనే తింటేను
ఏదయిన అమృతమే !!
పిల్లలం చదువుపై
శ్రద్ధ చూపుదమండి !
అమ్మనాన్నల కలలు
నిజం చేసెదమండి !!

- బెలగాం భీమేశ్వరరావు,  prajasakti  Sat, 5 Jan 2013, IST


No comments:

Post a Comment